రూ.వంద కోసం అన్ననే కొట్టి చంపాడు..

3 Aug, 2021 07:43 IST|Sakshi

అమరాపురం(అనంతపురం జిల్లా): మద్యం మత్తు ఆ వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేసింది. అన్నకు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చారని తండ్రితో గొడవ పెట్టుకుని.. చివరికి నిలువునా అన్న ప్రాణాలు తీశాడు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన యంజేరప్పకు నలుగురు కుమారులు. ఆదివారం పింఛన్‌ అందుకున్న తల్లి.. కుమారులు లక్ష్మన్న(35)కు రూ.300, రంగప్పకు రూ.200 చొప్పున ఇచ్చింది.

తాగి ఇంటికొచ్చిన రంగప్ప తనకెందుకు రూ.వంద తక్కువ ఇచ్చారంటూ గొడవ పెట్టుకున్నాడు. సర్దిచెప్పబోయినన అన్నపై కోపంతో ఊగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన రంగప్ప.. పొద్దుపోయాక లక్ష్మన్న వద్దకు వచ్చి మళ్లీ గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో  కర్రతో లక్ష్మన్నపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు