భార్య పిల్లలను చంపి డ్రామా.. మూడేళ్లకు చిక్కిన నిందితుడు

2 Sep, 2021 15:55 IST|Sakshi

లక్నో: వివాహేతరం సంబంధం ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ హత్యకు సంబంధించి నిందితుడితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులను, ఓ మహిళను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బుధవారం గ్రేటర్ నోయిడాలోని ఇంటి లోపల ఉన్న గొయ్యి నుంచి శరీర భాగాలను పోలీసులు వెలికితీశారు. అదే సమయంలో మట్టి, కంకరతో కప్పబడి ఉన్న పిల్లల చెప్పులను కూడా  గుర్తించారు.  పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్‌ నోయిడాలో ఓ ప్రైవేట్‌ ల్యాబొరేటరీలో 2018లో రాకేశ్‌(34) అనే వ్యక్తి పాథాలజిస్ట్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో యూపీకి చెందిన ఓ మహిళా పోలీసుతో నిందితుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 2018 ఫిబ్రవరిలో అతడి ఇద్దరు పిల్లలను, భార్యను చంపి ... ఆపై సిమెంట్‌తో కప్పేసి మృతదేహాలను ఇంట్లో పాతిపెట్టాడు.

చదవండి: కాళ్లు మొక్కినా కనికరించలే..! వరుసబెట్టి ముగ్గురిని..!

నిందితుడి డ్రామా
భార్యాపిల్లలను హత్య చేసిన తర్వాత తన భార్య  పిల్లలను తీసుకుని, ఎలాంటి సమాచారం లేకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ నేరానికి సంబంధించిన వివిధ రకాలుగా నిందితుడి కుటుంబం అతడికి సహాయం చేసిందని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా నిందితుడి తండ్రి రిటైర్డ్ పోలీస్‌ అని తెలిపారు.
 
నేరం ఛేదించడానికి మూడు సంవత్సరాలు
తన కూతురు, పిల్లలు కనిపించక పోవడంతో కొన్నాళ్ల తర్వాత రాకేష్ మామ కిడ్నాప్, వరకట్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నోయిడా పోలీసులు తప్పిపోయిన వ్యక్తి కేసు, మామ దాఖలు చేసిన కేసు రెండింటినీ దర్యాప్తు చేశారు. కానీ ఈ రెండు కేసులలో పెద్దగా ఆధారాలు దొరకలేదు. ఇదే క్రమంలో నిందితుడు రాకేశ్‌, ప్రియురాలు కలిసి కస్గంజ్‌లోని తన గ్రామానికి చెందిన మరొకరిని హత్య చేశారు. అతడికి శిరచ్చేదం చేసి, చేతులు నరికి ఆ రెండింటిని తగుల బెట్టారు. తర్వాత ఆ శవానికి నిందితుడు తన దుస్తులు తొడిగాడు. అది అతని శరీరం అని నిరూపించడానికి తన గుర్తింపు కార్డులను ఆ శవంపై వదిలేశాడు. 

అయితే కస్గంజ్‌లో హత్య కేసులో తల లేని మృతదేహానికి పోలీసులు డీఎన్‌ఏ పరీక్ష చేయించారు. నెల రోజుల క్రితం ఆ మృతదేహం రాకేష్ కాదని పోలీసులు గుర్తించారు. దాంతో వారు కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఓ సాక్షి పోలీసులను దిలీప్ శర్మ అనే పేరుతో హర్యానాలో నివసిస్తున్న రాకేశ్ వద్దకు తీసుకెళ్లాడు. అతను తూర్పు యూపీలోని కుశీనగర్ జిల్లాకు చెందినవాడని ఆ ఇంటి యజమానికి తెలిపినట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా నిందితుడు పాథాలజిస్ట్‌గా పనిచేయడం వల్ల వేలిముద్రలతో సహా సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలో అతనికి తెలుసునని కస్గంజ్ పోలీస్ చీఫ్ రోహన్ ప్రమోద్ బోత్రే చెప్పారు.

చదవండి: లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!

మరిన్ని వార్తలు