మద్యానికి బానిసైన భర్త.. ఇంటి నుంచి వెళ్లగొట్టిన భార్య.. ప్రతీకారంతో..

2 Aug, 2021 19:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను పొడిచి చంపి, కత్తితో నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ఢిల్లీలోని మంగోల్‌పురిలోకి చెందిన సమీర్‌(45) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. తరచూ డబ్బులు కావాలని భార్య షబానాతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నెల క్రితం అతడిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది. అప్పటి నుంచి అతను వీధుల్లో నివసిస్తున్నాడు.

తాను నిరాశ్రయుడు కావడానికి తన భార్య కారణం అని ప్రతీకారంతో.. శనివారం ఉదయం భార్య షబానాతో ఘర్షణ పడి హత్య చేశాడు. అంతేకాకుండా భార్యను కత్తితో పొడిచి చంపి స్టేషన్‌లో లొంగిపోయాడు.’’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై నిందితుడుని మంగోల్‌పురి స్టేషన్‌ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఇక అతని భార్య షబానా (40)ను స్థానికులు సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. కాగా, ఈ జంటకు 21, 17 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు