షాకింగ్‌ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి..

3 Oct, 2022 09:20 IST|Sakshi
నిందితుడు రామకృష్ణ

అఫ్జల్‌గంజ్‌(హైదరాబాద్‌): వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపిన మేరకు.. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన పత్లావత్‌ రామకృష్ణ (31) నగరంలోని గచ్చిబౌలిలో పుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
చదవండి​‍: ప్రేమ పెళ్లి.. భార్యపై అనుమానం.. చివరికి ఊహించని ఘటన

అతని రెండవ భార్య పత్లావత్‌ అరుణ అతని తమ్ముడితో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం రావడంతో శనివారం గౌలిగూడలోని మణికంఠ లాడ్జికి తీసుకువచ్చి ఆదివారం ఆమెను హత్య చేసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు