తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

7 Sep, 2021 02:01 IST|Sakshi

గుజరాత్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నేరాలకు కేరాఫ్ అవుతోంది. అక్కడ ఓ ప్రదేశంలో రోడ్డు పక్కన మూత్రవిసర్జనకు వెళ్లిన ఓ పెద్దాయనకు యువతి చెయ్యి కనిపించింది. అయితే తను దానిని బొమ్మ చెయ్యి అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించి చూస్తే ఆ చెయ్యి చుట్టూ ఈగలు ముసురుతూ నిజమైన చెయ్యి లాగే అనిపించింది. దాంతోపాటు దుర్వాసన కూడా రాసాగింది. ఇక దాంతో ఆ పెద్దాయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల గాలించగా కాళ్లు, చేతులు, మొండం, గుర్తు పట్టడానికి వీలుగా లేని ఓ యువతి ముఖం కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నిందితుని పేరు సందకుమార్, పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను జాబ్ చేస్తున్న ఫ్యాక్టరీలో రెండేళ్ల కిందట బీహార్‌కి చెందిన ఓ యువతిని పేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆ యువతిని లొంగతీసుకున్నాడు. సందకుమార్ తనకు పెళ్లైన విషయం దాచిపెట్టాడు.  ఆమెతో తరచూ శారీరక సంబంధం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోకుండా వాయిదా వెయ్యసాగాడు. అయితే ఓ రోజు ఆ యువతి గట్టిగా నిలదీసి అడగితే టైమ్ పడుతుంది అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు.

ఇక దాంతో తనను పెళ్లి చేసుకోకపోతే అతడిపై అత్యాచారం కేసు పెడతానని యువతి బెదిరించింది. ఈ నేపథ్యంలో అతను ఆ యువతిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.తన ప్లాన్ ప్రకారం సూరత్ రైల్వే స్టేషన్‌లో ఆ యువతిని రైలు ఎక్కించి ఆమెను నందర్‌బార్ అనే ఏరియాలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి అన్ని దిక్కులకూ విసిరేశాడు. ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఓ బండరాయితో గట్టిగా మోదాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం.. హత్య జరిగిన చుట్టుపక్కల సీసీ కెమెరాలు సీసీ కెమెరాల్ని పరిశీలించారు. యువతి, ఆమె పక్కన ఓ మధ్య వయస్కుడు వెళ్తున్నట్లు కనిపించినట్టు గుర్తించారు.

దాంతో అతనే ఆమెను చంపి ఉండొచ్చు అని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అతను ఎవరో తెలుసుకునే క్రమంలో సూరత్ పోలీసులు ఓ టెక్నికల్ పర్సన్‌ సాయంతో యువతి పక్కన వెళ్తున్న వ్యక్తి మొబైల్ నంబర్ ట్రేస్‌ చేశారు. దాదాపు 15 రకాల మొబైల్ నంబర్లు ఆ ఏరియాల్లో అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. అయితే అందులో ఒక నంబర్ మాత్రం మూడు ప్రదేశాల్లో కనిపించింది. దాంతో ఆ నంబర్ గల వ్యక్తే ఆమె పక్కన ఉన్న వ్యక్తి అంటూ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తమ శైలిలో విచారణ చేయగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. 

మరిన్ని వార్తలు