రూమ్‌మేట్‌ దారుణ హత్య..ఆ తరువాత

9 Aug, 2021 08:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,ముంబై: క్షణికావేశంలో రూమ్‌మేట్‌ను దారుణంగా హత్య చేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టిన వైనం స్నేహం అన్న పదానికే కళంకాన్నిఆపాదించింది.  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలో  శనివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.

నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్‌ (35), దేవాన్ష్‌ వఘోడే (26) పనిచేస్తున్నారు. ఇద్దరూ  స్నేహితుల్లా ఒకే దగ్గర పని.. ఒకే గదిలో నివాసం. కలిసిమెలిసి ఉంటున్న వీరి మధ్య స్వల్ప విషయంలో వివాదం మొదలైంది. ఈ ఘర్షణ మరింత ముదిరి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో నందేశ్వర్‌ను తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ ఏ మాత్రం పశ్చాత్తాపం లేని అతగాడు మృతదేహాన్ని గదికి సమీపంలోని ప్రదేశంలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు రూమ్‌లో ప్రశాంతంగా  నిద్ర పోయాడు. ఆ ప్రదేశాన్ని చూసి అనుమానం వచ్చిన స్థానికులు ఆదివారం ఉదయం సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దేవాన్ష్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు  వెల్లడించారు.

చదవండి :  Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి

మరిన్ని వార్తలు