అనుమానంతో భార్యను హత్య చేసి.. అత్తమామ ఇంటికి తీసుకెళ్లి

28 Sep, 2022 09:48 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను అనుమానించి చివరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి హగరిబొమ్మనహళ్లి తాలూకా బ్యాసగదేరి గ్రామంలో జరిగింది. విజయనగర జిల్లా ఎస్పీ డాక్టర్‌ అరుణ్‌ తెలిపిన మేరకు వివరాలు..బ్యాసగదేరి నివాసి రవికుమార్‌(32) తన బంధువు దీపా(21)తో దాదాపు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి భార్యపై అనుమానపడుతూ నిత్యం గొడవ పడుతుండేవాడు.

ఈక్రమంలో సోమవారం రాత్రి గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. హత్య చేసిన అనంతరం అదే గ్రామంలో నివాసముంటున్న తన అత్తమామ ఇంటికి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని అక్కడ వదిలేసి వెళ్లాడని తెలిపారు. మృతురాలి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రవికుమార్‌తో పాటు అతని తండ్రి షణ్ముఖప్ప, తల్లి జయమ్మ, అక్క శిల్ప, చెల్లెలు సుజాతలను బంధించి కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. 
చదవండి: నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది

మరిన్ని వార్తలు