ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

31 Aug, 2021 06:50 IST|Sakshi

యశవంతపుర(కర్ణాటక): పెళ్లి చేసుకోనని చెప్పిన యువతిని నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ఘటన బెంగళూరు కెంగేరి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. దొడ్డబెలె రోడ్డు నివాసి అనిత (23) అనే యువతి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. సహొద్యోగి వెంకటేశ్‌ మూడేళ్ల నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. వెంకటేశ్‌తో పెళ్లికి అనిత కుటుంబీకులు తిరస్కరించారు. అనిత కూడా అదే మాట చెప్పడంతో వెంకటేశ్‌ పగ పెంచుకున్నాడు.

సోమవారం ఉదయం 7.15 గంటలప్పుడు అనిత దొడ్డబెలె రోడ్డులో నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తుండగా వెంకటేశ్‌ అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అనితను స్థానికులు తక్షణం బీజీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్థారించినట్లు పశ్చిమ డీసీపీ సంజీవ్‌ పాటిల్‌ తెలిపారు. వెంకటేశ్‌ ఇటీవల మార్కెట్‌కు వెళ్లి రూ. 80 పెట్టి పదునైన కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజరాజేశ్వరి ఆస్పత్రిలో అనిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:
బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి 
నవ వధువును కిడ్నాప్‌ చేసిన టీడీపీ నేత

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు