వన్‌ సైడ్‌ లవ్‌: ప్రేమించిన యువతిని హత్య

26 Jul, 2021 09:15 IST|Sakshi

తిరువొత్తియూర్‌: ప్రేమించిన యువతిని తనకిచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు తిరస్కరించడంతో నిద్రపోతున్న యువతిపై బండరాయి వేసి ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన తంజై జిల్లాలో చోటుచేసుకుంది. తంజై జిల్లా పట్టుకోట్టైకి చెందిన పాండ్యన్‌ కుమార్తె మౌనిక (18). తిరువారూర్‌ జిల్లా ముత్తుపేట పట్టణ పంచాయతీకి చెందిన ప్రాంతంలో ఉన్న అవ్వ రాజకుమారి ఇంటిలో ఉంటూ తిరుచ్చిలో పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతోంది.

ఈ క్రమంలో మౌనిక బంధువు అయిన ముత్తుపేట తిరుకలూర్‌ గ్రామానికి చెందిన శివ శంకర్‌ (28). ఇతను మౌనికను వన్‌ సైడ్‌ లవ్‌ చేసినట్లు తెలిసింది. మౌనికను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను కోరాడు. అందుకు వారు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన శివశంకర్‌ శనివారం రాత్రి రాజకుమారి ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న మౌనికపై బండరాయి వేశాడు. మౌనిక అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు శివశంకర్‌ను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు