బిడ్డతో తప్పుడు పనులంటూ అనుమానం, భార్య, మామ హత్య

10 May, 2021 08:04 IST|Sakshi

టీ.నగర్‌: కుటుంబ తగాదాలో భార్య, మామను హతమార్చిన ఆటో డ్రైవర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రాయపేట మహ్మద్‌ హుస్సేన్‌ వీధికి చెందిన ముసాఫర్‌ (80) కుమార్తె కౌవుసి నిషా (50)మొదటి భర్తను విడిచి రాయపేట యానైకుళానికి చెందిన ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ (42)ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ద్వారా జన్మించిన కుమార్తె(21)తో ఒకే ఇంటిలో ఉంటోంది. కౌవుసి నిషా తన కుమార్తెను తప్పుడు మార్గంలో నడుపుతున్నట్లు అబ్దుల్‌ ఖాదర్‌ అనుమానించాడు.

దంపతుల మధ్య తరచుగా గొడవలు ఏర్పడ్డాయి. కౌవుసి నిషా కుమార్తెతో రాయపేటలో ఉంటున్న తండ్రి ముసాఫర్‌ ఇంటికి చేరుకుంది. అబ్దుల్‌ ఖాదర్‌ అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. బీర్‌ బాటిల్‌తో ముసాఫర్‌పై దాడి చేశాడు. కత్తితో భార్య గొంతుకోశాడు.  ఇద్దరూ మృతి చెందారు. జామ్‌ బజార్‌ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఓమందూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్‌ ఖాదర్‌ను అరెస్టు చేశారు.  

భార్య మృతిని తట్టుకోలేక.. 
టీ.నగర్‌: భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతిచెందాడు. ఈ సంఘటన శివగంగై జిల్లాలో చోటుచేసుకుంది. దేవకోట్టై దండాయుధపాణి ఆలయం వీధిలో స్వామినాథన్‌ (90), సుందరాంబాళ్‌ (88) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహం కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుందరాంబాళ్‌ అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక భర్త స్వామినాథన్‌ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. భార్యాభర్తలు ఒకేరోజున మృతిచెందడం విషాదాన్ని నింపింది.
చదవండి: నా కుటుంబాన్ని కూడా చంపేందుకు చూస్తున్నారు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు