వివాహేతర సంబంధం.. భార్యతో ఫోన్‌ చేయించి.. ఇంటికి రప్పించి.. భర్త షాకింగ్‌ ట్విస్ట్‌

28 Oct, 2022 13:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజాం సిటీ (శ్రీకాకుళం జిల్లా): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం బలిగొంది. పదేళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం వదులుకోవాలని చూసినా వినిపించుకోకపోవడంతో పాటు పదిమందిలో తన భర్త అవమానాలకు గురికావడంతో భార్యాభర్తలు పన్నిన పథకంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంతకవిటి మండలం మద్దూరుశంకరపేట గ్రామంలో హత్యకు గురైన అల్లబోయిన గోవిందరావు హత్య కేసు మిస్టరీని  24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..

ఎంఆర్‌ అగ్రహారానికి చెందిన గోవిందరావు, శంకరపేట గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పలుమార్లు పెద్దల వద్ద పంచాయితీ పెట్టినప్పటికీ గోవిందరావు వినిపించుకోలేదు. విశాఖపట్నంలో పనిచేస్తూ గ్రామానికి వచ్చిన ప్రతిసారి ఆమెను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇదిలా ఉండగా గోవిందరావు ఎప్పటికప్పుడు ఆమె భర్తను అవహేళనచేస్తూ అవమానకరంగా ప్రవర్తించేవాడు.

దీనిని భరించలేకపోయిన భార్యాభర్తలు గోవిందరావును హతమార్చేందుకు పథకం పన్నారు. ఈ మేరకు ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన గోవిందరావును హత్య చేసేందుకు జంతువుల వేటకు ఉపయోగించే విధంగా జీఐ వైరుకు విద్యుత్‌షాక్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. తమ ఇంటికి వస్తున్న దారిలో జీఐ వైరు కట్టి దానికి విద్యుత్‌ సరఫరా అయ్యేలా చేశారు. ఇలా ప్రతి రోజూ రాత్రి ఏర్పాటుచేసి ఉదయం తీసేసేవారు.

చివరికి ఈ నెల 25న  రాత్రి శంకరరావు తన భార్యతో ఫోన్‌ చేయించి గోవిందరావును ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన గోవిందరావు జీఐ  వైరు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీం సహాయంతో దర్యాప్తు చేసి నిందితులుగా   భార్యభర్తలను నిర్ధారించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఆయనతోపాటు సంతకవిటి ఎస్సై ఆర్‌.జనార్దనరావు, లోకేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.  

మరిన్ని వార్తలు