‘వరుస’ తప్పి.. ప్రేమికుడిని మట్టుబెట్టి..

24 Jan, 2021 06:59 IST|Sakshi

వరుసకు సోదరుడితోపాటు మరో యువకుడితో ప్రేమ వ్యవహారం

సోదరుడితో కలసి యువకుడి హత్య

వరంగల్‌: ఆ యువతి ప్రేమ వరుస తప్పింది. వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ప్రేమించింది. అంతకుముందు ఆ సోదరుడి స్నేహితుడిని ప్రేమించింది. తమ వ్యవహారం సాఫీగా కొనసాగాలంటే తొలుత ప్రేమించిన వ్యక్తిని హత్య చేయాలని సోదరుడిని ఒప్పించి మట్టుపెట్టించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలను వరంగల్‌ ఏసీపీ కలకోట గిరికుమార్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇద్దరు స్నేహితులు.. నడుమ యువతి
వరంగల్‌ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌కు చెంది న కోమటి విజయ్, రెడ్డిమల్ల రాంకీ స్నేహితులు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే క్రమంలో రాంకీ పెద్దనాన్న కూతురు, కాజీపేటకు చెందిన రెడ్డిమల్ల యా మిని పరిచయమైంది. విజయ్‌తో ఆమె ప్రేమలో పడగా, వీరి వివాహానికి విజయ్‌ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినా ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అదే సమయంలో వరుసకు తమ్ముడైన రాంకీతోనూ యామిని శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. వీరిద్దరూ వరంగల్‌ డాక్టర్స్‌ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నా రు. ఓ రోజు రాంకీ తన స్వగ్రామమైన వర్ధన్నపేట కు యామినిని తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. తాను విజయ్‌తో కలిసినప్పటి ఫొటోలను స్నేహితులకు పంపిస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని, దీంతో తమ సంబంధం సాఫీగా సాగుతుందని సోదరుడిని ఒప్పించింది. 

కెనాల్‌లోకి తోసి...
రాంకీ ఈ నెల 4న విజయ్‌ను తన ఇంటికి పిలిచా డు. వివిధ ప్రాంతాల్లో కారులో తిరిగిన అనంతరం 5న గీసుకొండ శివారు కాకతీయ కెనాల్‌ వద్ద ఇద్ద రూ కల్లు తాగారు. మత్తులో ఉన్న విజయ్‌ ముఖం పై రాంకీ బలంగా గుద్ది కెనాల్‌లోకి తోసేయడంతో నీటిలో కొట్టుకుపోయాడు. ఈ నెల 7న వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం శివారులోని కాకతీయ కెనాల్‌లో మృతదేహం కొట్టుకురా గా గుర్తు తెలియని వ్యక్తిదిగా పోలీసులు కేసు నమో దు చేశారు. అదేసమయంలో తన కుమారుడు కానరావడం లేదని విజయ్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మృతదేహం విజయ్‌దిగా పోలీసులు తేల్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగు చూసింది. పక్కా సమాచారంతో రాంకీ, యామినిని శనివారం అరెస్టు చేశారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు