గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి 

18 Apr, 2021 07:43 IST|Sakshi

పట్నంబజారు(గుంటూరు): 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. గుంటూరు నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం కిష్కిందపాలేనికి చెందిన వృద్ధురాలు 15 సంవత్సరాల క్రితం కూలీ పనుల నిమిత్తం వచ్చి కామాక్షి నగర్‌లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు  ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు.

ప్రస్తుతం ఉన్న కుమారుడు, కుమార్తెలకు వివాహం కావడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ఒంటరిగా నివశిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి తలుపులు కొట్టినట్లు శబ్ధం రావడంతో కుమారుడు వచ్చాడనుకుని తలుపులు తీసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత స్పృహలోకి వచ్చిన సీతమ్మ స్థానికులకు విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి  
దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు