టెన్త్‌ క్లాస్‌మెట్‌.. పెళ్లి చేసుకుంటానని యువతిని లొంగదీసుకుని..

28 Nov, 2021 12:29 IST|Sakshi

పెనమలూరు(కృష్ణా జిల్లా): ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన యువకుడు, అతని కుటుంబసభ్యులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పోరంకి సాలిపేటకు చెందిన యువతి (24)ను టెన్త్‌లో క్లాస్‌మెట్‌ అయిన అదే గ్రామానికి చెందిన కోలా బలరామ్‌ కల్యాణ్‌ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు.

చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి..

యువతి తొలుత నిరాకరించినప్పటికీ తనను ప్రేమించకపోతే చనిపోతానని కళ్యాణ్‌ అనడంతో నమ్మిన యువతి అతని ప్రేమను అంగీకరించింది. తదనంతరం అతను ఆమెపై పలుసార్లు లెంగిక దాడి చేశాడు. అయితే అతను, అతని కుటుంబ సభ్యులు కోలా శివ వెంకట మల్లేశ్వరరావు, కోలా నాగజ్యోతి, కోలా కనకశ్రీవాణి పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు