పకోడి బండి వద్ద వివాదం.. టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి మృతి

29 Mar, 2021 10:16 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలోని వీరవరంలో దారుణం చోటుచేసుకుంది. వీరబాబు అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో పకోడి బండి వద్ద స్వల్ప వివాదం చోటకోవటంతో వీరబాబు ఆ పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి యజమాని ఏసు, ఆయన కొడుకు శివకు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో శివను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ  తన తండ్రికి వ్యాపారంలో పకోడి బండి వద్ద సహాయంగా ఉంటున్నాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో వీరవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీరవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.
చదవండి: రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు.. 11 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు