భార్యభర్తల గొడవ.. నా కూతురినే అల్లరి చేస్తావా అంటూ..

6 Nov, 2021 10:13 IST|Sakshi

పాలకోడేరు(పశ్చిమ గోదావరి): తన కూతురిపై అబద్దాలు చెబుతూ అల్లరి చేస్తావా అంటూ అల్లుడిపై దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఎస్సై సీహెచ్‌ఎస్‌ రామచంద్రరావు తెలిపారు. పెన్నాడపాలెంకు చెందిన నామన ఏసుబాబుకు 20ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవల భార్యాభర్తలు గొడవలు పడగా పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఏసుబాబు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా నా భార్య దగ్గరకు రానీయడంలేదని, అందుకే చచ్చిపోదామనుకున్నానని గ్రామంలో పలువురికి చెబుతుండడంతో నా కూతురిని అల్లరి చేస్తావా? అంటూ ఏసుబాబును మామ బాదిన వెంకన్న బీరుబాటిల్‌తో కొట్టి గాయపరిచాడు. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరగా ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో వెంకన్నపైనా, సహకరించిన మరో నిందితుడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
(చదవండి: కి.మీ.కు 15 నుంచి 30 పైసలు పెంపు!)

మరిన్ని వార్తలు