పెళ్లయి రెండేళ్లయినా సంతానం కలగలేదని.. భార్యపై..

28 Dec, 2022 11:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పత్తికొండ రూరల్‌(కర్నూలు జిల్లా): పెళ్లి జరిగి రెండేళ్లు అయినా సంతానం కలగలేదని భార్యపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.  మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. మండల పరిధిలోని చందోలి గ్రామానికి చెందిన బోయ లాలప్ప, ఆదిలక్ష్మి  కుమార్తె భవానీని రెండేళ్ల క్రితం డోన్‌ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి వివాహం చేశారు.

గత కొన్ని నెలల నుంచి సంతానం కలగలేదని భార్యను  వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. మంగళవారం ఇదే విషయంపై భార్యతో గొడవపెట్టుకుని  దాడి చేశాడు. వెన్నెముక, కాళ్లు, చేతులపై విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె కుప్పకూలిపోయింది. భవానీని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా  మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేసినట్లు బాధిత మహిళ తల్లిదండ్రులు తెలిపారు.
చదవండి: ప్రియురాలితో గోవా టూర్‌ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే! 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు