కిరాతక భర్త: ఆస్తి విక్రయానికి ఒప్పుకోలేదని 

6 Aug, 2021 06:50 IST|Sakshi

భార్యకు చిత్రహింసలు  

తుమకూరు(కర్ణాటక): డబ్బు కోసం ఓ భర్త రాక్షసునిగా మారాడు. ఆస్తిని విక్రయించడానికి భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా సీఎస్‌పుర పరిధిలోని జన్నేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... జన్నేనహళ్లి గ్రామానికి చెందిన నాగ వైరముడి, మమత లకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు బెంగళూరుతో పాటు గ్రామంలో కొంత ఆస్తి ఉంది.

ప్రస్తుతం నాగవైరముడికి డబ్బులు అవసరం వచ్చాయి. బెంగళూరులో ఉన్న ఇంటిని విక్రయించడానికి సన్నాహాలు చేస్తుండగా భార్య అడ్డుకుంది. ఆస్తిని అమ్మడానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగవైరముడి స్నేహితులతో కలిసి వచ్చి భార్యను చితకబాదాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఎస్‌ పుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.   

మరిన్ని వార్తలు