-

పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా.. 

11 Nov, 2020 06:47 IST|Sakshi

కత్తితో యువతిపై దాడికి యత్నం 

బయటకు పరుగులు తీసిన కుటుంబసభ్యులు  

పరారీలో నిందితుడు 

సాక్షి, విజయవాడ పశ్చిమ: తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానంటూ ఓ యువతిపై దాడికి యత్నించిన ఘటనపై  సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని పెజ్జోనిపేటలో నివాసముంటున్న యువతి(33) ఆర్టీసీ గవర్నరుపేట–1 డిపోలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ మెకానిక్‌ ఎం.అజయ్‌కుమార్‌ రెండు నెలల నుంచి యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ విష యం తెలిసిన అజయ్‌కుమార్‌ సోమవారం రాత్రి  మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానంటూ జేబులో నుంచి కత్తి తీసి ఆమెపై  దాడికి యత్నించడంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతితో సహా కుటుంబ సభ్యులంతా బయటకు పరుగు తీశారు. స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఘటనపై మంగళవారం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    (విజయవాడలో భారీ అగ్నిప్రమాదం)

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటనపై కేసు నమోదు 
కృష్ణలంక(విజయవాడ పశ్చిమ):  పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.12.20లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనపై కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోటకు చెందిన కంది లక్ష్మీదేవి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐదేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఇటీవల పునర్వివాహం చేసుకునేందుకు తెలుగు మాట్రిమోనిలో రిజిస్టర్‌ చేయించుకున్నారు. జూన్‌ 27న మాట్రిమోని ద్వారా జగ్గవరపు ప్రదీప్‌కుమార్‌తో పరిచయవడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రదీప్‌ వివిధ రకాలుగా అవసరాల నిమిత్తం ఆమె నుంచి 3 విడతలుగా రూ.12లక్షల 20వేలు అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలలుగా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. మోసపోయానని గ్రహించిన లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో.. )

మరిన్ని వార్తలు