ప్రేమ పేరుతో లైంగికంగా దగ్గరై.. ఆ దృశ్యాలను వీడియో తీసి

19 May, 2022 07:24 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మైసూరు: యువతులను ప్రేమించినట్లు నటించి లైంగికంగా దగ్గరై నగ్న దృశ్యాలను వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వంచకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా బసవటిక గ్రామానికి చెందిన గురుసిద్దప్ప కుమారుడు బీ.జీ. శివప్రకాశ్‌.. గూగుల్‌ మీట్, ఫేస్‌బుక్‌ద్వారా యువతులకు రిక్వెస్ట్‌ పెట్టి పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నట్లు నటించేవాడు.

అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకునేవాడు. ఆ సమయంలో యువతులకు తెలియకుండా వీడియోలు తీసేవాడు. డబ్బు ఇవ్వకపోతే నగ్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బెదిరించేవాడు. బాధిత యువతులు ఇచ్చిన ఫిర్యాదుతో మైసూరు నగర మహిళా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: (ప్రియురాలికి హాయ్‌ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ) 

మరిన్ని వార్తలు