హెలికాప్టర్‌ సర్వీస్‌ అని రూ.17 వేలు టోపీ 

7 Sep, 2022 08:26 IST|Sakshi

మైసూరు: మైసూరు నగరంలో ఆన్‌లైన్‌ మోసాలకు హద్దు లేకుండా పోతుంది. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో వంచనకు గురవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం దర్శనం కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెబ్‌సైట్‌లో గాలించి రూ. 17,000 పోగొట్టుకున్నాడు. మైసూరు గాయత్రి పురంలో నివాసం ఉంటున్న జీ బసవణ్ణ (32) వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నాడు.

ఇందుకోసం జమ్ములో నుంచి ఆలయం వరకు హెలికాప్టర్‌ సర్వీసు ఉన్నదని, బుక్‌ చేసుకోవచ్చని హిమాలయ హెలిప్యాడ్‌ అనే సంస్థ ఆఫర్‌ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయుడు వెబ్‌సైట్‌ ద్వారా రూ. 17,000 చెల్లించాడు. ఆ తరువాత ఎన్నిరోజులైనా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు మైసూరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

(చదవండి: వరదలపై సమీక్ష సమావేశం... నిద్రపోయిన మంత్రి)

మరిన్ని వార్తలు