మొబైల్‌ చోరీ.. 3 కి.మీ వెంటాడి సాధించాడు

15 Feb, 2021 18:44 IST|Sakshi

చెన్నై : ఓ వ్యక్తి దొంగతనానికి గురైన తన మొబైల్‌ ఫోన్‌ను దక్కించుకోవటానికి ఏకంగా మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు.  ఆ దొంగకి ముచ్చెమటలు పట్టించడంతో పాటు భయం తెప్పించి చివరకు విజయం సాధించాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత శుక్రవారం చెన్నై పెరుర్‌కు చెందిన పార్తిబన్‌ అనే వ్యక్తి వడ పెరుంబాక్కమ్‌-మాధవరమ్‌ రోడ్‌లో బైక్‌ ఆపి, ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ దొంగ అతడి చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని పరిగెత్తాడు. ( విషాదం: ఇద్దరు పిల్లల్ని హతమార్చి.. ఆత్మహత్య )

పార్తిబన్‌ ఆ దొంగవెంట పడ్డాడు. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ఛేజింగ్‌ సాగింది. దొంగకు అతి చేరువగా వెళ్లగా.. భయపడిపోయిన తస్కరుడు చివరకు ఫోన్‌ను కిందపడేసి పారిపోయాడు. పార్తిబన్‌ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు