నిండా ముంచిన అత్యాశ.. రూ. 20 లక్షలు హాంఫట్‌

24 Feb, 2022 08:37 IST|Sakshi

 రూ.20 లక్షలకే కిలో బంగారం అంటూ కుచ్చుటోపీ 

నకిలీదని తేలడంతో బాధితుల ఆందోళన

చందుర్తి(వేములవాడ): అత్యాశకు పోయి నిండా మునిగారు. నకిలీ బంగారాన్ని రూ.20లక్షలకు అంటగట్టారు. విషయాన్ని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సుధీర్‌కు ఇదే గ్రా మంలో బెల్టుషాపు వద్ద అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన నవీన్‌ రెండునెలల క్రితం పరిచయమయ్యాడు. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లిన నవీన్‌ సుధీర్‌కు తరుచూ ఫోన్‌ చేస్తుండేవాడు. ఎప్పటిలాగే ఈనెల 16న సుధీర్‌కు ఫోన్‌చేసిన నవీన్‌ తన స్నేహితుల వద్ద కిలో బంగారు పూసలు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని న మ్మబలికాడు.

18న అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్‌రోడ్డుకు రావాలని సూచించాడు. దీంతో సుధీర్‌ తన స్నేహితులైన ఆ నందం, చంద్రశేఖర్‌ను తీసుకుని వెళ్లారు. నవీన్‌ వ ద్దనున్న నాలుగు బంగారు పూసలిచ్చి పరీక్షించుకోవాలని సూచించగా.. మెలిమి బంగారమేనని నిర్ధారించుకున్నారు. మొత్తం బంగారం రూ.20లక్షలు అని రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.15లక్షలు ఇచ్చి పూసలు తీసుకున్నారు. కొంతదూరం వచ్చాక వాటిని క్షుణ్ణంగా పరీక్షించగా.. నకిలీవిగా గుర్తించారు. వెంటనే గోరంట్లకు చేరుకుని స్థానిక సీఐ జయనాయక్‌కు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అతాశ్యకు పోయి మోసపోయామని భావించిన లింగంపేటకు చెందిన సదరు ముగ్గురు ఊరిలోకి రాలేక హైదరాబాద్‌లోనే ఉన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.  

   

మరిన్ని వార్తలు