భర్త నిర్వాకం.. ప్రియురాలితో గుట్టుగా కాపురం.. భార్యకు తెలిసి..

2 Jun, 2022 16:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహితను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్న వ్యక్తిపై పటమట పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన గంగాలక్ష్మికి ప్రసాదంపాడుకు చెందిన ఫణికుమార్‌తో 2017లో వివాహం అయింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. 2018లో వీరికి ఒక పాప పుట్టింది. మూడేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగానే సాగింది.
చదవండి: వివాహితను ఇంటిలో నిర్బంధించి లైంగికదాడి.. రెండు రోజుల తర్వాత..

గత కొంత కాలంగా ఫణికుమార్‌ కాంట్రాక్ట్‌ పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు వెళుతున్నాడు. రెండు నెలలకు ఒక సారి ఇంటికి వస్తూ పోతూ, రాను రాను ఇంటికి రావడం మానేశాడు. దీంతో గంగాలక్ష్మి పెనమలూరులోని తన సొంత ఇంటికి వెళ్లింది. ఫణికుమార్‌ వేరొక అమ్మాయిని  వివాహం చేసుకొని ఆయుష్‌ ఆసుపత్రి సమీపంలో కాపురం పెట్టినట్టు గంగాలక్ష్మికి తెలియడంతో గంగాలక్ష్మి పటమట పోలీసులను  ఆశ్రయించింది. బాధితురాలి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు