పెళ్లి పేరుతో లైంగిక దాడి 

8 Dec, 2021 13:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూప్రాన్‌(మెదక్‌): పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్‌ మండలం యావపూర్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి 2019లో పదో తరగతి చదివి ఇంటి వద్దనే ఉంటోంది. సెప్టెంబర్‌లో యావపూర్‌లో నిర్వహించిన బోనాల పండగకు తూప్రాన్‌కు చెందిన ఏర్పుల నరేంద్ర తన ఇద్దరి స్నేహితులతో ఇంటికి వచ్చాడు.

ఆ పరిచయంతో తన సెల్‌ఫోన్‌ నంబరు తీసుకొని పలుమార్లు ఫోన్‌చేసి మాట్లాడాడు. అదేనెల 26న తల్లి కూలీ పనులకు వెళ్లిన సమయంలో నరేంద్ర ఇంటికి వచ్చి బలవంతంగా శరీరకంగా లొంగదీసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం ఎవరితోనైన చెబితే చంపేస్తానని బెదిరించినట్లు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరంగా లొంగతీసుకున్నాడంది.

కడుపులో నొప్పిగా ఉండటంతో తన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా రెండు నెలల గర్భవతని వైద్యులు తెలిపారన్నారు. ఈ విషయంపై నరేంద్రను నిలదీస్తే పెళ్లి చేసుకోనని, నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అని బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పటికే నరేంద్రకు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసిందన్నారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు