యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..

3 Jun, 2022 19:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు (క్రైమ్‌): ప్రేమ పేరిట యువతిని మోసగించిన వ్యక్తిపై చిన్నబజార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. మైపాడు గేట్‌ ప్రాంతానికి చెందిన మోహన్‌.. మనుమసిద్ధినగర్‌కు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని మోహన్‌ను యువతి ఇటీవల నిలదీయడంతో ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై కేసు నమోదు చేశామని ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌సైదా తెలిపారు.
చదవండి: వైజాగ్‌ అల్లుడొచ్చాడు.. వస్తూనే సందడి చేశాడు..

మరిన్ని వార్తలు