పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిని లోబర్చుకుని..

14 May, 2022 13:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెదగంట్యాడ(గాజువాక): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తరువాత గర్భవతిని చేసి ముఖం చాటేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూపోర్టు సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 65వ వార్డుకు చెందిన ఓ యువతి(21)ని 64వ వార్డు గంగవరం గ్రామానికి చెందిన చోడిపిల్లి సురేష్‌ (23) ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతిని లోబర్చుకుని, శారీరకంగా అనుభవించాడు.
చదవండి: ప్రేమ వివాహం.. అర్ధరాత్రి నిద్ర లేచి..

ఇటీవల ఆమె ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొవడంతో వైద్యులను సంప్రదించగా గర్భవతి అని తేలింది. వెంటనే ఆమె ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ముఖం చాటేశాడు. మోసపోయానని గుర్తించిన ఆమె న్యూపోర్టు పోలీసులను శుక్రవారం ఆశ్రయించింది. స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. న్యూపోర్టు సీఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు