ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య 

11 May, 2022 07:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రియురాలితో గొడవ పడిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన సానుతపా(28) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి దుండిగల్‌లోని గ్రీన్‌ మెట్రోలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు.

ఈ విషయాన్ని దుండిగల్‌ చౌరస్తాలో నివాసముండే తన చిన్నాన్న కుమారుడు, సెక్యూరిటీగార్డు సాహిల్‌కు చెప్పి తనకు ఇది మామూలే అంటూ పడుకునేందుకు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మంగళవారం ఉదయం సాహిల్‌కు తోటి కార్మికుడైన టీకా రామ్‌ ఫోన్‌ చేసి దుండిగల్‌ గ్రీన్‌ మెట్రో సమీపంలోని తుమ్మచెట్టుకు సానుతపా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాహిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..)

మరిన్ని వార్తలు