నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని

10 Aug, 2022 13:30 IST|Sakshi
అరిగెల రాజప్రకాష్‌

సాక్షి, ఖమ్మం: ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమనరీ పరీక్ష సరిగా రాయలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఖమ్మం టూటౌన్‌ ఎస్సై రాము కథనం ప్రకారం.. కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామానికి చెందిన అరిగెల రాజప్రకాష్‌(24) నాలుగు నెలల క్రితం కవిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన వీరిద్దరు ఖమ్మం బుర్హాన్‌పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఎస్సై ఉద్యోగానికి సిద్ధమయ్యారు.

భద్రాచలంలో రాజప్రకాష్, కవిత ఖమ్మంలో ఇటీవల ఎస్సై రాతపరీక్ష రాయగా కీ చూసుకుంటూ తక్కువ మార్కులు వస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో రాజప్రకాష్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఇక బతకడం వృథా అని బాధపడుతుండగా, కవిత మరోమారు ప్రయత్నం చేయొచ్చని సర్దిచెప్పింది. కానీ ప్రేమ వివాహం కావడం, ఇద్దరికీ ఉద్యోగాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజప్రకాష్‌ ఆవేదన చెందాడు.

దీంతో కవిత బయటకు వెళ్లిన సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కవిత కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చూసే సరికే మృతి చెందాడు. వివాహమైన నాలుగు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కన్నీరుగా మున్నీరుగా రోదించడం కలిచివేసింది.
చదవండి: నన్ను కలిస్తేనే సర్టిఫికెట్‌.. మహిళకు వైద్యుడి వేధింపులు

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు