కనకదుర్గ వారధి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

21 Sep, 2020 21:02 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ :  పూజ చేసుకుంటాన‌ని వ‌చ్చి కనకదుర్గ వారధి పై నుంచి దూకి ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటుచేసుకుంది. గ‌ల్లంతైన వ్య‌క్తిని  తాడిగడపకి చెందిన మన్నేదుర్గాప్రసాద్‌గా గుర్తించారు. వివ‌రాల ప్ర‌కారం గ‌త కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దుర్గాప్రసాద్ అనే వ్య‌క్తి కనకదుర్గ వారధి వ‌ద్ద పూజ చేసుకుంటాన‌ని వెళ్లాడు. త‌మ్ముడి కొడుకు సుజిత్‌ని పూజ్ జ‌రుగుతున్నంత సేపు వీడియో రికార్డ్ చేయ‌మ‌న్నాడు. దీంతో సుజిత్ ఫోన్‌లో రికార్డు చేస్తుండ‌గా ఇక్క‌సారిగా దుర్గాప్ర‌సాద్ న‌దిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అనారోగ్యంతో చనిపోతున్నానని దుర్గాప్ర‌సాద్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులు సొంతం చేసుకున్నారు. అయితే కళ్ళ ముందే పెద్దనాన్న చనిపోవతంతో  సుజిత్ షాక్‌కి గుర‌య్యాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు గ‌ల్లంతైన దుర్గాప్ర‌సాద్ కోసం గాలిస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు