రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్‌ నిర్ణయం.. ఏం జరిగింది?

3 Feb, 2023 20:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజమహేంద్రవరం రూరల్‌(తూర్పుగోదావరి): రెండురోజుల్లో పెళ్లి... మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. సంతోషంగా గడపాల్సిన సమయం..ఇంతలో  ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మూరులోని బాలాజీపేట రోడ్‌లో శ్రీ అపార్టుమెంటులో  గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథ«నం ప్రకారం శ్రీ అపార్ట్‌మెంటులో ఉంటున్న బొరుసు మంగాదేవికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహాలయ్యాయి.

నాలుగో సంతానం రాజీవ్‌బాబు(32).దానవాయిపేట యాక్సెస్‌ బ్యాంక్‌లో ఐటి విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతితో ఈనెల 4వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10గంటలకు మంగాదేవి, కుమార్తెలు కలసి షాపింగుకు వెళ్లారు. రాజీవ్‌ను రమ్మని కోరారు. ఇంటిలో టీవీ రిపేరు చేయించి వస్తానని అతడు సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్లారు.

మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మెయిన్‌ డోర్‌ తెరిచి ఉంది. బెడ్‌రూమ్‌ డోర్‌ వేసి ఉంది. రాజీవ్‌ పడుకుని ఉన్నాడని భావించారు. తమ పనిలో పడిపోయారు. కాస్సేపటి తర్వాత రాజీవ్‌ను నిద్రలేపుదామని కిటికీలో నుంచి చూశారు.  ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్‌ అయ్యారు.

శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుని తల్లి  ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజీవ్‌ నిశ్చితార్ధమైనప్పటి నుంచి కాబోయే భార్యతో సరదాగా మాట్లాడేవాడు. పరస్పరం గిఫ్ట్‌లు ఇచ్చుకునేవారిని కుటుంబ సభ్యులు తెలిపారు.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే  

మరిన్ని వార్తలు