ప్రాణం తీసిన ఫుల్ ‌బాటిల్‌ పందెం

24 Oct, 2020 06:33 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ : మద్యం బాటిల్‌లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పందెంలో ఒకరు మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎస్‌ సాయిలు (40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. చేనులో అందరు కలిసి మద్యం సేవిస్తుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన పెరిగి బెట్టింగ్‌కు దిగారు.

ఇరువురు సోడా, నీరు కలపకుండా ఫుల్‌ బాటిల్‌ సేవించారు. ఇరువురు మత్తులోకి జారిపోగా తోటి మిత్రులు వీరిని ఇళ్లకు  పంపించారు. అయితే సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు. దీంతో  కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు