రైలుకు ఎదురెళ్లి.. గాలిలోకి లేచి.. పది కిలోమీటర్ల తర్వాత..

19 Oct, 2021 18:13 IST|Sakshi

పెనుకొండ(అనంతపురం జిల్లా): జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ బాలాజీ నాయక్‌ తెలిపిన మేరకు... సోమవారం సాయంత్రం పెనుకొండలోని ఆర్టీసీ డిపో సమీపంలో చిలమత్తూరుకు చెందిన మంజునాథ్‌ (35) రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం వైపుగా వెళుతున్న స్పెషల్‌ ట్రైన్‌ కిందపడేందుకు ప్రయత్నించిన అతను రైలు పట్టాల మధ్యలో నిలబడి ఉండగా ఇంజన్‌ ఢీకొంది. (చదవండి: తల్లి ఇంట్లో ఉండగా ప్రియుడికి ఫోన్‌ చేసి రప్పించి ఎంత పనిచేసింది..)

ఘటనలో గాలిలోకి లేచిన మంజునాథ్‌ తిరిగి అదే ఇంజన్‌ కప్‌లింగ్‌ హుక్‌కు తగులుకున్నాడు. దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కాజిపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత విషయాన్ని స్టేషన్‌లో రిపోర్ట్‌ చేసేందుకు లోకో పైలెట్‌ ప్రయత్నించినప్పుడు ఇంజన్‌ కప్‌లింగ్‌ హుక్‌కు తగులుకున్న మంజునాథ్‌  మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని తొలగించి పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు