జూబ్లీహిల్స్‌లో దారుణం: కలిసి మద్యం తాగారు, మళ్లీ వచ్చి చూస్తే

12 Apr, 2021 09:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో దారుణ హత్య జరిగింది. గత రాత్రి 2గంటల సమయంలో శివ (40) హత్యకు గురయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి శివ తన స్నేహితులు రాకేశ్‌, శ్రీనివాస్‌, డేవిడ్‌తో కలిసి శివ మద్యం సేవించాడు. మద్యం సేవించిన అనంతరం రాకేశ్‌, శ్రీనివాస్‌ వెళ్లిపోగా.. శివ, డేవిడ్‌ మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో స్నేహితుడు శ్రీనివాస్‌ వచ్చి చూడగా మద్యం సేవించిన ప్రదేశంలో తల పగిలి రక్తపు మడుగులో శివ విగత జీవిగా కనిపించాడు.

వెంటనే శీనివాస్‌ పోలీసులకు సమాచారం అందించగా.. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు శివ కూలి పని చేసుకుంటూ, ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అనుమానితుడు డేవిడ్‌ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: అత్తారింటికి వచ్చి.. బావిలో పడి ఇద్దరు అల్లుళ్ల మృతి

మరిన్ని వార్తలు