పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!

24 Apr, 2022 15:42 IST|Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు మృతి చెందాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్‌ ఎన్‌ఓసీ విషయంలో బాలిజీ మోటర్స్‌ షోరూం యజమానితో ఈ నెల 10న  ప్రశాంత్‌, శ్రావన్‌ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు.

దీనిపై షోరూం యజమాని గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్‌, శ్రావన్‌లను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ ఉదయ్‌ కిరణ్‌ వేధించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌ఐ ఉదయ్‌ కిరణ్‌ వేధింపులు భరించలేకనే ఈ నెల 12 న ప్రశాంత్‌ పోలిసు స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.

12 రోజులుగా  చికిత్స పొందుతూ.. మృతి  చెందాడు. ఈ ఘటనలో గణపురం ఎస్‌ఐ ఉదయ్‌ కిరణ్‌, షోరూం యజమానిపై కేసులు నమోదు అయ్యాయి. ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌కు సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 
 

మరిన్ని వార్తలు