స్నేహితుడి మృతిపై అనుమానం.. కత్తితో హత్య

20 Feb, 2021 11:22 IST|Sakshi

నాగోలు: తాగుడుకు బానిపై డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్న తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడిని, హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఖననం చేసిన తల్లిని శుక్రవారం ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. ఎల్‌బీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా, తుంగతూర్తి మండలం తుర్పుగుడెం(వి) చెందిన గుండ్ల మల్లయ్య(45) భార్య వీరమ్మ తో పాటు కుమారుడు వెంకటేష్, మల్లయ్య తల్లి రాములమ్మతో కలసి ఎల్‌బీనగర్‌ శివగంగాకాలనీలో రాఘవేంద్ర ఎన్విరాన్మెంట్‌ అపార్ట్‌మెంట్స్‌లో వాచ్‌మెన్‌ ఉంటున్నాడు. కుమారుడు వెంకటేష్‌ ప్రసుత్తం కార్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నాడు. మల్లయ్య మద్యానికి బానిసై తరుచు మద్యం సేవిస్తూ డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు.

ఈనెల 15వ తేదీన మద్యం సేవించేందుకు తన తల్లి రాములమ్మ దగ్గర బలవంతంగా రూ.100 తీసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో మళ్లీ గొడవ పడటంతో సమాచరం అందుకున్న వెంకటేష్‌ ఇంట్లో ఉన్న కత్తితో మల్లయ్య ఛాతీ, గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు వెంకటేష్, తల్లి వీరమ్మలు కలసి రక్తం మరకలు పూర్తి తుడిచేసి బట్టలు మార్చి మృతదేహాన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అక్కడ నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తన సొంత గ్రామ మైన తుర్పుగుడెం శ్మశానవాటికలో కొంత మంది బంధువులు, గ్రామస్తులుతో కలసి అంత్యక్రియలు చేశా రు.

ఈనెల 17వ తేదీన మల్లయ్య మృతి చెందినట్లు మృతుడి స్నేహితుడు నర్సింహ తెలుసుకున్నాడు. తన స్నేహితుడి మృతిపై అనుమానం ఉన్నట్లు ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు.  

చదవండి: కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్‌ ప్రమాదం
చదవండి: ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసే ప్రేమాయణం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు