‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’

14 Jan, 2022 17:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, యశవంతపుర (కర్ణాటక): విరాజ్‌పేట ఎమ్మెల్యే కేజీ బోపయ్యను బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తుమకూరు జిల్లా కొరటగెరెకి చెందిన ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఆనంద్‌ బోపయ్యకు ఫోన్‌ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని, లేదంటే ఏసీబీతో దాడి చేయిస్తానని బెదిరించాడు. దీంతో ఎమ్మెల్యే సీఎం, హోం మంత్రికి ఫిర్యాదు చేశారు.  మడికెరి పోలీసులు దర్యాప్తు చేసి ఆనంద్‌ను బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్‌ చేశారు.  

ఏసీబీకి చిక్కిన పీడీఓ, కార్యదర్శి 
గంగావతి:  పట్టాదారు పుస్తకంలో పేర్ల మార్పు కోసం  బండిబసప్ప క్యాంప్‌నకు చెందిన విజయ్‌కుమార్‌ నుంచి రూ.6వేలు లంచం స్వీకరిస్తూ  పీడీఓ షేర్‌సాబ్, కార్యదర్శి నూరుల్లాఖాన్‌లు గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. దాడుల్లో   ఏసీబీ డీఎస్పీ శివకుమార్‌  పాల్గొన్నారు.

చదవండి: రిపబ్లిక్‌ డే టా‍ర్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం

మరిన్ని వార్తలు