భార్యభర్తల గొడవ ఎంత పనిచేసింది..

25 Apr, 2021 19:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, లక్ష్మణచాంద(నిర్మల్‌): రోడ్డు నిర్మాణం సందర్భంగా పెట్టిన సేప్టీ బోర్డును బైక్‌తో డీకొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘంటన మండలంలోని కనకాపూర్‌ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మేక గోపీచంద్‌ (42) మేదరిపేట్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్‌లో భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు .శుక్రవారం ఇంటి వద్ద తన అత్తమ్మ విషయంలో భార్యా భర్తలు గొడవ పడ్డారు. రాత్రి బాగా పొద్దుపోయాక తమ స్వగ్రామమైన మేదరిపేట్‌కు వెళ్తానని చెప్పి నిర్మల్‌ నుండి బయలు దేరాడు.

మండలంలోని కనకాపూర్, బాబా పూర్‌ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం సందర్బంగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన సేప్టీ బోర్డును అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వేగంగా డీకొట్టుకొని బ్రిడ్జీ నిర్మాణం కోసం పక్కనే తీసిన పిల్లరు గోతిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మేదరి విజయలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఎస్సై వినయ్‌కుమార్‌ తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు