విజిలెన్స్‌ విచారణలో బట్టబయలు 

29 Aug, 2020 10:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రామగుండం: గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రవీందర్‌ అనే వ్యక్తి తన సోదరుడు రామదాసు పేరు మీద 12 ఏళ్లుగా టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగంలో కొనసాగుతున్న విషయం విజిలెన్స్‌ విచారణలో తేలింది. గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్శ రమేశ్‌ వివరాల మేరకు..గాదె రామదాసు, గాదె రవీందర్‌ ఇద్దరు కవలలు. పన్నెండు సంవత్సరాలక్రితం గాదె రామదాసుకు తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో జూనియర్‌ లైన్‌మెన్‌గా ఉద్యోగంరాగా రవీందర్‌ ఉద్యోగంలో చేరాడు. పదోన్నతి పొందుతూ లైన్‌మెన్‌ వరకు చేరుకున్నాడు. గోదావరిఖని ఎన్పీడీసీఎల్‌ ఈ సెక్షన్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్టిఫికెట్లలో పేర్లుదిద్ది ఉద్యోగం చేస్తున్న క్రమంలో అధికారులకు అనుమానంరావడంతో ఎన్పీడీసీఎల్‌ విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం నిర్ధారణ కావడంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. మంథని డివిజనల్‌ ఇంజినీర్‌ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. 


>
మరిన్ని వార్తలు