ఢిల్లీ అంజలి సింగ్‌లాంటి ఘటన: పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

7 Feb, 2023 15:29 IST|Sakshi

ఢిల్లీలో కొత్తడేది రోజున జరిగిన అంజలి యాక్సిడెంట్‌ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన ఉత్తర ‍ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడు గుర్తుపట్టలేనంత స్థితిలో దారుణంగా గాయపడి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఒక వ్యక్తి  సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిన ఢీ కొట్టి 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.. ఈ ఘటనను మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ఉన్న టోల్‌ బూత్‌ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ పరిసరా ప్రాంతాల్లోని సీసీఫుటేజ్‌లు పరిశీలించి..సదరు వ్యక్తిని ఢిల్లీ నివాసి వీరేంద్ర సింగ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు.  అతను ఆగ్రా నుంచి నోయిడాకు బయలు దేరుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఐతే అతను విచారణలో సోమవారం రాత్రి దట్టమైన మంచు ఉండటంతో తాను గమనించలేకపోయానని చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.

అంతేగాదు తనకు ఆ దట్టమైన మంచు కారణంగా ఢీ కొట్టినట్లు కూడా తెలియలేదని, కారు కింద ఇరుక్కున్నట్లు గమనించలేకపోయినట్లు వివరించాడు. ఐత ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉందని చెప్పారు పోలీసులు. అతడిని గుర్తించేందుకు సమీప ‍ప్రాంతంలోని సీసీ కెమెరాలను ముమ్మరంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 

(చదవండి: 'నిజమైన స్నేహితుడికి అర్థం భారత్‌': ధన్యావాదాలు తెలిపిన టర్కీ)

  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు