మొబైల్‌ ఫోన్ల ఈఎమ్‌ఐ పేరిట భారీ మోసం

16 Sep, 2020 21:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : మొబైల్‌ ఫోన్ల ఈఎమ్‌ఐ పేరిట 2500 మందిని మోసగించాడో వ్యక్తి. ఫేక్‌ వెబ్‌సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న అతడి గుట్టు రట్టయి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌కు చెందిన జితేంద్ర సింగ్‌ అనే వ్యక్తి ఫేక్‌ వెబ్‌సైట్ల ద్వారా తక్కువ మొత్తం ఈఎమ్‌ఐలకు ఖరీదైన మొబైల్‌ ఫోన్లు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసగించసాగాడు. పోలీసుల నిఘానుంచి తప్పించుకోవటానికి వీపీఏ ద్వారా పేమెంట్లు చేయమనే వాడు. గత సంవత్సరం డిసెంబర్‌లో జితేంద్ర చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ( దారుణం: కస్తూర్భ టీచర్‌పై భర్త కత్తి దాడి )

తాజాగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో 2500 మందిని ఇప్పటివరకు తాను మోసం చేసినట్లు చెప్పాడు. జితేంద్రతో పాటు మరో వ్యక్తి ఈ మోసాలలో భాగంగా ఉన్నాడని పోలీసులు తేల్చారు. గడిచిన రెండేళ్లలో వివిధ నకిలీ వెబ్‌సైట్ల పేరుతో వీరు మోసాలు చేసినట్లు గుర్తించారు. వీపీఏ ద్వారా 1,999నుంచి 7,999 రూపాయలు వరకు చిన్న చిన్న మొత్తాలను మాత్రమే తీసుకునే వారని విచారణలో వెల్లడైంది. ( రైనా బంధువులపై దాడి కేసు: ముఠా అరెస్ట్‌ )

మరిన్ని వార్తలు