ఏం జరిగిందో.. కరెంట్‌ వైర్‌ తీసుకుని రూమ్‌కి వెళ్లి..

21 Nov, 2021 08:39 IST|Sakshi

సాక్షి,మియాపూర్‌(హైదరాబాద్‌): కరెంటు వైరుతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికిరణ్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌లోని హాఫీజ్‌పేట్‌ ఆదిత్యానగర్‌కు చెందిన సంపత్‌ (51) అదే కాలనీలో సెంట్రింగ్‌ సామాగ్రి గోడౌన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా గోడౌన్‌లోని సెక్యూరిటీ రూమ్‌లోనే ఉంటున్నాడు.

ఇతనికి సంబంధించిన బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. శనివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో సెంట్రింగ్‌ గోడౌన్‌లో పనిచేసే సిబ్బంది వచ్చి సెంట్రింగ్‌ సామగ్రిని తీసుకుపోయేందుకు వాచ్‌మెన్‌ డోరు తీసి చూడగా రూమ్‌లో సంపత్‌ వేలాడుతూ కనిపించాడు. దీంతో సిబ్బంది  సూపర్‌ వైజర్‌ కిశోర్‌ దేవోజీ, మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేవని పోలీసులు తెలిపారు. గోడౌన్‌ సూపర్‌ వైజర్‌ కిశోర్‌ దేవోజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది

మరిన్ని వార్తలు