రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. లోకోపైలెట్‌ అప్రమత్తమైనప్పటికీ...

6 May, 2022 08:53 IST|Sakshi

హుబ్లీ: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం హుబ్లీలో చోటు చేసుకుంది. రెండుకాళ్లు తెగిపోయి క్షతగాత్రుడు విషమ స్థితిలో హుబ్లీ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... మధ్యాహ్నం షాలీమార్‌ వాస్కోడిగామా రైలు హుబ్లీ స్టేషన్‌ వదిలిన నాలుగు నిముషాలకు హెగ్గేరి సమీపంలో వస్తుండగా ఓ వ్యక్తి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టాడు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటోంది. లోకో పైలెట్‌ రైలు వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అతని రెండు కాళ్లు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బాధితుడిని కిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రుడి వివరాలు తెలియల్సి ఉంది.    

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

(చదవండి: బ్లూవేల్‌ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య)

మరిన్ని వార్తలు