వికృత చేష్టలు.. ‘పౌడర్‌’ స్వామి అరెస్ట్‌ 

8 May, 2021 10:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌/చెన్నై : దెయ్యం వదిలిస్తానంటూ మహిళలను కొరడాతో కొట్టి హింసిస్తున్న పౌడర్‌ స్వామిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నామక్కల్‌ జిల్లా కాదపల్లికి చెందిన అనిల్‌కుమార్‌ (42) మంజనాయకనూరు కరుప్పన్నస్వామి ఆలయాన్ని తన వికృత చేష్టలకు అడ్డాగా మార్చుకున్నాడు.  దెయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో తన దగ్గరకు వచ్చిన మహిళలను కొరడాతో దారుణంగా  కొట్టేవాడు. అతను ముఖానికి పౌడర్‌ పూసుకోవడంతో పౌడర్‌స్వామిగా పేరుపొందాడు. మహిళలను హింసిస్తున్న దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌ చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టడంతో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఎస్పీ శక్తిగణేశన్‌ ఆదేశాల మేరకు వేలగౌండం పోలీసులు అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు