ఆన్‌లైన్‌ పోర్న్‌ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు

8 Jun, 2021 09:32 IST|Sakshi
నిందితుడు భరత్‌కుమార్‌

కాల్‌బాయ్‌ అంటూ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

నాగోలు: డబ్బులు ఇవ్వకుంటే కుంటుంబ సభ్యుల ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా, నారాయణపేట మండలం, పల్లా అర్జున్‌వాడాకు చెందిన తుము భారత్‌కుమార్‌(22) ప్రస్తతం బీఏ చదువుతున్నాడు. నిందితుడు ఆన్‌లైన్‌ పోర్న్‌ సినిమాలకు బానిసయ్యాడు. ఆన్‌లైన్‌లో కాల్‌బాయ్‌ అని చెప్పుకుంటూ తన కాంటాక్ట్‌ నంబర్‌ను లోకాంటో, స్కోక్కా వంటి వివిధ వైబ్‌సైట్లలో ఫోన్‌ నంబర్‌ పోస్ట్‌ చేశాడు. అక్కడ ఉండి స్పందనలు రాకపోవడంతో నిందితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తికి గూగుల్‌ హ్యాంగ్‌అవుట్స్‌లో చాట్‌ చేయమని కోరాడు.

దీంతో కొన్ని రోజులు వారు చాట్‌ చేస్తూ బాధితుడి వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ సేకరించాడు. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ సృష్టించి అక్కడ నుంచి నిందితుడిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ కుటుంబ సభ్యుల ఫోటోలు తన దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భారత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
 
శ్రీలతారెడ్డిపై పీడీ యాక్ట్ 
హస్తినాపురం: బెదిరింపులు తప్పుడు ఫిర్యాదులు చేసి పోలీసులను సైతం వేధించి అక్రమంగా లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కిలాడీ లేడీ శ్రీలతారెడ్డిపై రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ సోమవారం పీడీ యాక్టు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగార్జునకాలనీకి చెందిన ఎలిమినేటి శ్రీలతారెడ్డి(34) సాధారణ ప్రజల దగ్గర చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసేది.

తిరిగి డబ్బులు అడిగితే వారిపైనే పోలీసులకు తప్పడు ఫిర్యాదు చేసేది. కులం పేరుతో మహిళను దూషించిన కేసులో వనస్థలిపురం పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన పంథా మార్చుకోకుండా శ్రీలతారెడ్డి పోలీసు అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేసింది. దీనిపై సీపీ సమగ్ర విచారణ చేపట్టి పీడీ యాక్టు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు