మాయమాటలు చెప్పి బాలిక కిడ్నాప్‌! 

1 Apr, 2021 09:37 IST|Sakshi
శ్రీదేవి

సాక్షి, హస్తినాపురం: బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు కిడ్నాప్‌కు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వనస్థలిపురం ఎస్సై చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలంలోని కేసీఆర్‌కాలనీకి చెందిన సంకు శ్రీసౌమ్య ఆటోనగర్‌లోని నవతా ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తూ మన్సురాబాద్‌లోని చిత్రసీమకాలనీలో అద్దెకు ఉంటోంది. రెండు నెలల నుంచి తన చెల్లెలు సంకు శ్రీదేవి(17) తన దగ్గరే ఉంటుండగా ఈనెల 24రోజున భద్రాచలం గ్రామానికి చెందిన చెట్ల తరున్‌కుమార్‌ (20) మాయమాటలు చెప్పి కిడ్నాప్‌కు చేశాడని సౌమ్య వనస్థలిపురం పోలీసులకు 25న ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌కు గురైన శ్రీదేవి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోందని తెలిపారు. గతంలో కూడా తరున్‌కుమార్‌పై భద్రాచలం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య 
మాడ్గుల: ఓ మైనర్‌ బాలిక (16).. తండ్రి మందలించాడని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై బద్యానాయక్‌ కథనం ప్రకారం.. మాడ్గుల మండలంలోని కూబ్యాతండాకు చెందిన మైనర్‌బాలిక అదే తండాకు చెందిన ఓ యువకుడితో మాట్లాడినందుకు గాను తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక మంగళవారం అర్థరాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు భోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్‌ తెలిపారు. 

చదవండి: బంజారాహిల్స్‌లోయువతి కిడ్నాప్‌ కలకలం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు