సమోసా తిన్నందుకు కొట్టి చంపేశాడు

26 Apr, 2022 06:22 IST|Sakshi

భోపాల్‌: మానవత్వం మంటగలిసింది. డబ్బులివ్వకుండానే సమోసా తిన్నాడనే చిన్న కారణంతో దుకాణదారు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చోళా ప్రాంతంలోని శంకర్‌నగర్‌లో హరిసింగ్‌ అహిర్వార్‌ దుకాణంలోకి మద్యం మత్తులో ఉన్న వినోద్‌ అహిర్వార్‌ (40) ప్రవేశించి సమోసాను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. హరిసింగ్‌ కోపంతో తలపై కర్రతో కొట్టడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు