సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు

2 Dec, 2022 20:14 IST|Sakshi

ఢిల్లీలోని శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం మరువక మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని బయటకు వెళ్దాం అని చెప్పి హత్య చేసి నిప్పంటించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.... చత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన  21 ఏళ్ల తనూ కుర్రే ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తుండేది. ఆమె తన స్నేహితుడు సచిన్‌ అగర్వాల్‌తో కలిసి నవంబర్‌ 21న బలంగీర్‌కి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె తన కుటుంబ సభ్యులతో టచ్‌లో లేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు రాయ్‌పూర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసులు ఈ కేసు విషయమై విచారిస్తుండగా...బలంగీర్‌లో కాలిపోయి పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు.

ఆ మృతదేహ​న్ని తనూదిగా ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. అనతరం పోలీసులు ఆమె ప్రియుడు సచిన్‌ అగర్వాల్‌ని అనుమానిస్తూ...ఆ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడు సచిన్‌ అగర్వాల్‌ ప్రియురాలు తనూ చనిపోయిన ప్రాంతంలో ఎక్కువగా సంచరించినట్లు ఫోన్‌ లోకేషన్‌ తెలుపుతోంది. దీంతో పోలీసులు తమదైన తరహాలో సచిన్‌ని గట్టిగా విచారించగా...నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.

తనూని బలంగీర్‌ చుట్టూ సరదాగా తిరిగొద్దాం అని చెప్పి బయటకు తీసుకు వెళ్లినట్లు చెప్పాడు. తనను మోసం చేస్తుందని భావించి హత్యచేసి చంపేసినట్లు తెలిపాడు. అనతరం పెట్రోల్‌ పోసి తగలు బెట్టినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

(చదవండి: తీస్తే మరో దృశ్యం సినిమా అవుతుందేమో!.. గొంతుకోసి.. వేడినూనె, యాసిడ్‌తో ముఖం కాల్చేసి..)

మరిన్ని వార్తలు