ఆ రిలేషన్‌ని వద్దన్నారని...ప్రియురాలి సోదరుడు, తండ్రిపై దాడి

30 Nov, 2022 21:08 IST|Sakshi

ఒక వ్యక్తి తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రియురాలి తండ్రి సోదరుడుపై పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని రంసోల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సమల్ అనే వ్యక్తి కాలియాపాణిలోని మార్కెట్‌ వద్ద ఉన్న ప్రియురాలి సోదరుడు జితేంద్ర వద్దకు వచ్చి పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అతని కేకలు విన్న అతని తండ్రి సంతోష్‌ జితేంద్రను రక్షించడానికి అడ్డుగా వచ్చాడు.

దీంతో సమల్‌ అతడి తండ్రి సంతోష్‌పై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో ఈ ఘటనలో తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు బీరెస్‌ సమల్‌ అలియాస్‌ సంతను బాధితుడు జితేంద్ర సోదరితో సంబంధం పెట్టుకున్నాడు. ఐతే సమల్‌ వివాహితుడు కావడంతో జితేంద్ర, అతని తండ్రి వారి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో కోపం పెంచుకున్న సమల్‌ వారిపై అతి కిరాతకంగా దాడి చేశాడు.

దీంతో స్థానికులు సమల్‌ను పారిపోకుండా అడ్డుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఐతే బాధితుడు జితేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని, అతడి తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహంతో నిందితుడి ఇంటిని కూల్చివేసి, నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: షాకింగ్‌ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు