షాకింగ్‌ ఘటన: దొంగతనం చేశాడని..‍కదులుతున్న రైలు నుంచి తోసేసి..

19 Dec, 2022 15:55 IST|Sakshi

దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేశారు. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒక గుర్తు తెలియని 20  ఏళ్ల వ్యక్తి షాజహాన్‌పూర్‌లోని తిల్హర్ రైల్వే స్టేషన్ పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. సదరు వ్యక్తి రైల్వే పట్టాల వద్ద ఉండే ఓవర్‌హెడ్‌ లైన్‌ పోల్‌కి తల ఢీకొట్టడంతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

ఐతే మృతుడికి సబంధించిన ఒక వైరల్‌ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేసింది. ఆ వీడియోలో ఒక జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్‌ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్‌ కింద కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి.

దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్‌ ఫోన్‌ షాజహాన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. వాస్తవానికి బాధితుడు ఫోన్‌ దొంగలించి లక్నోలో ట్రైయిన్‌ ఎక్కినట్లు తేలింది. అయితే అక్కడ జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లోని ఒక సముహం అతని వద్ద ఈ ఫోన్‌ని గుర్తించి దాడి చేసి రైలులోంచి తోసేశారని పోలీసలు చెబుతున్నారు. దొంగలించిన అరగంటలోనే బాధితుడు రైల్వే పట్టాలపై విగతజీవిగా పడిఉన్నట్లు తెలిపారు. 

(చదవండి: మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి)

>
మరిన్ని వార్తలు